రమదాన్ విరాళాల ప్రచారాలలో పిల్లలు.. మంత్రిత్వ శాఖ వార్నింగ్

- March 17, 2024 , by Maagulf
రమదాన్ విరాళాల ప్రచారాలలో పిల్లలు.. మంత్రిత్వ శాఖ వార్నింగ్

రియాద్: వాణిజ్య మార్కెటింగ్, ప్రకటనలలో పిల్లలను వాడుకోవడానికి వ్యతిరేకంగా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD)  హెచ్చరిక జారీ చేసింది.  బాలల రక్షణ చట్టంలోని ఆర్టికల్ మూడు, దాని నిబంధనలను అమలు చేయడంలో భాగంగా తాజా ఉత్తర్వులను జారీ చేసినట్లు వెల్లడించింది. ఆందోళన, ఒత్తిడి, బెదిరింపులకు గురికావడం వంటి వాటితో సహా పిల్లలపై ప్రతికూల ప్రభావాలపై చూపడంపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ముఖ్యంగా రమదాన్ విరాళాల ప్రచారాలలో లాభాపేక్షలేని సంస్థలు పిల్లలను ఉపయోగించడాన్ని ఇటీవలి గుర్తించారు. ఇవి చట్టానికి విరుద్ధమైన చర్యలుగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని, 19911 నంబర్‌ను సంప్రదించడం ద్వారా లేదా దాని మొబైల్ యాప్ ద్వారా పిల్లల దోపిడీకి సంబంధించిన ఏవైనా సందర్భాలను నివేదించాలని కమ్యూనిటీని కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com