తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా
- March 18, 2024
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్ సభకు ఆమె పోటీ చేస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో తిరునల్వేలి లేదా దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవిని వదులుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.
గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తమిళసై సౌందర్య రాజన్ మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డీఎంకే మహిళా నేత కనిమొళి 3.5 ఓట్ల మెజారిటీతో ఆమెపై గెలుపొందారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష