తెలంగాణలో వర్షాలు..
- March 18, 2024
హైదరాబాద్: నేటి నుంచి 4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అకాల వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి నుంచి కురిసిన వడగళ్ల వర్షంతో వరి, గోధుమ, ఉల్లి, జొన్న, పొగాకు, నువ్వులు, కూరగాయల పంటలు నాశనమయ్యాయి. మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 26,129 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు