ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- March 18, 2024అమరావతి: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా సిద్ధం సభలతో ప్రచారాన్ని ప్రారంభించారు. జగన్ రానున్న రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. వైనాట్ 175 అనే సింగిల్ టార్గెట్ తో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాట్లాడుతూ…మేమంతా సిద్ధం పేరుతో జగన్ ప్రజల్లోకి వెళ్లబోతున్నారని చెప్పారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. సిద్ధం సభలు జరిగిన నాలుగు ప్రాంతాలు మినహా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయని చెప్పారు. ప్రతి రోజు జగన్ ప్రజల్లోనే ఉంటారు.రాత్రి కూడా ప్రజల మధ్యే నిద్రిస్తారని తెలిపారు. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం జగన్ చేస్తారని చెప్పారు. రేపు పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు