ప్రబాస్‌కి ఈ సారి ఆ రూపంలో తప్పేలా లేదు.!
- March 18, 2024
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ప్రబాస్‌కి ఆ గుర్తింపు ప్లస్సా.? మైనస్సా.? తెలియని పరిస్థితి కొన్ని సార్లు. ప్రబాస్‌తో సినిమా అంటే చాలు అంచనాలు ఆకాశాన్నంటేస్తుంటాయ్.
అది బడ్జెట్ పరంగా కావచ్చు.. ఇంకే ఇతరత్రా హైప్ కావచ్చు. దాంతో, ఎలాంటి కథలు ఎంచుకోవాలో అనే డైలమాలో పడిపోతున్నాడు ప్రబాస్. ఆ డైలమాలోనే తప్పులో కాలేస్తున్నాడు.
వాస్తవానికి చెప్పాలంటే, ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ సినిమాల్లో బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్న చందంగా మారింది. ఇప్పుడు ‘కల్కి’ సినిమాతో రాబోతున్నాడు. మే 9న సినిమా రిలీజ్ అంటూ ఎప్పుడో ప్రకటించేశారు. అదే డేట్‌కి ఏది ఏమైనా సినిమా రిలీజ్ చేయాలని పట్టు పట్టి కూర్చున్నారు ‘కల్కి’ అండ్ టీమ్.
అయితే, సడెన్‌గా ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. దాంతో ఈ సినిమా అదే డేట్‌కి రిలీజ్ కావడం కష్టమే అని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఆ లెక్కల్లో చూసుకుంటే.. ఎంత పట్టు పట్టి కూర్చున్నా.. అనుకున్న డేట్‌కి ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష