‘కార్తికేయ 3’కి రంగం సిద్ధమవుతోందట.!
- March 18, 2024
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌ని ప్యాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘కార్తికేయ 2’. నార్త్‌లో ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టేయడంతో పాటూ.. ఇతర భాషల్లోనూ ఊహించని వసూళ్లు సాధించి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది నిఖిల్ కెరీర్లో ఈ సినిమా.
ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా నిఖిల్ స్టార్‌డమ్‌ని ఏమాత్రం తగ్గించకుండా.. అలా అని మరీ పెంచేయకుండా.. తటస్థంగా సక్సెస్ అవుతూ వస్తున్నాయ్. ఆయన తాజాగా ‘స్వయంభు’ సినిమాలో నటిస్తున్నారు. ఇదీ ప్యాన్ ఇండియా సినిమానే.
సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా.. నభా నటేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ఆ సంగతి అటుంచితే.. తనకు ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చి పెట్టిన ‘కార్తికేయ 2’ సినిమాకి నెక్స్ట్ పార్ట్ తెరకెక్కించేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఆల్రెడీ స్క్రిప్టు వర్క్ జరుగుతోందనీ తెలుస్తోంది. డాక్టర్ కార్తికేయ ఈ మూడో పార్ట్‌లో చేసే సాహసాలు మరింత ఆసక్తి కలిగించేలా వుండబోతున్నాయనీ ప్రచారం జరుగుతోంది. అనుపమనే ఈ పార్ట్‌లో కూడా హీరోయిన్గా కొనసాగుతుందా.? లేదంటే, మరో క్రేజీ హీరోయిన్ని పట్టుకొస్తారా.? పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష