‘ఉస్తాద్’ రెడీ అవుతున్నాడు బాస్.!
- March 19, 2024హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రావల్సి వుంది. కానీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ నిమిత్తం అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
అయితే ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కబోతోందనీ తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారట.
త్వరలోనే షూట్లో పాల్గొంటారనీ తెలుస్తోంది. అంతేకాదు, అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా వదలబోతున్నారనీ టాక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్ బంప్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
‘ఈ సారి సౌండ్ బద్దలైపోద్ది..’ అంటూ వదిలిన ఆ గ్లింప్స్‌కి ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక త్వరలో రిలీజ్ కాబోయే టీజర్లో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగులు, సన్నివేశాల్ని చొప్పించబోతున్నాడో హరీష్ శంకర్ చూడాలి మరి.
శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ ‘తెరి’కి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..