TWA-Q ఆధ్వర్యంలో దోహాలో ‘కమ్యూనిటీ ఇఫ్తార్’

- March 19, 2024 , by Maagulf
TWA-Q ఆధ్వర్యంలో దోహాలో ‘కమ్యూనిటీ ఇఫ్తార్’

దోహా: తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ (TWA-Q) దోహాలోని అబు హమూర్‌లోని ఐన్ ఖలేద్‌లోని ఉమ్ అల్ సెనీమ్ పార్క్ లో కమ్యూనిటీ ఇఫ్తార్ ని మార్చి 15వ తేదీన నిర్వహించింది. ముఖ్యఅతిథి ఖతార్‌లోని భారత రాయబారి హెచ్.ఇ. విపుల్ తోపాటు షానవాస్ బావ (ఐసిబిఎఫ్ అధ్యక్షుడు), దీపక్ శెట్టి (వైస్ ప్రెసిడెంట్ ఐసిబిఎఫ్), వర్కీ బోబన్ కె (జనరల్ సెక్రటరీ ఐసిబిఎఫ్),  అబ్దుల్ రవూఫ్ కొండోయిట్టి (హెడ్ ఆఫ్ ICBF ఇన్సూరెన్స్ & కమ్యూనిటీ వెల్ఫేర్), సత్యనారాయణ మలిరెడ్డి (మేనేజింగ్ కమిటీ మెంబర్ ICC), ICBF అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్(AOs) ప్రతినిధులు, ఖతార్‌లోని ఇతర కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. TWA-Q ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను భారత రాయబారి ప్రశంసించారు. భవిష్యత్ లోనూ ఇదే వేగంతో ముందుకుపోవాలని అభినందించారు. TWA-Q ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. తెలంగాణా వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ (TWA-Q) ఈ పవిత్ర రమదాన్ మాసంలో ఖతార్‌లో ఉంటున్న తమ కమ్యూనిటీ సభ్యులను ఒకచోటకు చేర్చిందన్నారు.  ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలోనవీద్ దస్తగిర్, రమేష్ పిట్ల, మహమ్మద్ షోయబ్, మహమ్మద్ సలావుద్దీన్, నాగరాజు, సయ్యద్ బకర్, కృష్ణ, మిస్టర్ గులాం రసూల్, తాహా, నదీమ్, తల్హా,  అమెర్,  వసీమ్, ఫిరోజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.  

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com