ఏప్రిల్ 28న డల్లాస్‍లో ‘మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక’
- March 19, 2024
డల్లాస్: ప్రతి మనిషికి తన చిన్ననాటి మిత్రులను కలవాలని, వారితో ఆనాటి ముచ్చట్లను పంచుకోవాలని, తమకు చదువులు చెప్పిన గురువులను కలవాలని.. వారికి కృతజ్ఞత తెలుపుకోవాలని ఉంటుంది. సరిగ్గా అలాంటి వారి కోసమే ఇది. బందరులో మీరు ఏ సంవత్సరంలో అయినా చదివినా.. ఏ స్కూల్ అయినా కావచ్చు, ఏ కాలేజ్ అయినా కావచ్చు.. మీరు మీ చిన్ననాటి మిత్రులను కలిసే అపూర్వ అవకాశాన్ని అమెరికాలోని బందరు కమ్యూనిటీ సభ్యులు కల్పిస్తున్నారు. గత 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జనవరి 26న హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్న మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం స్ఫూర్తితో అమెరికాలోని డల్లాస్ లోనూ బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది డల్లాస్ లో స్థిరపడిన బందరు పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రవేశం ఉచితం. వేదిక డల్లాస్ లో ఏర్పాటు చేయనున్నారు.ఏప్రిల్ 28వ తేదీన (ఆదివారం) ఉదయం 9.00 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.మరిన్ని వివరాలకు దొరరాజు (Olive Mithai Shop) ఫోన్ నంబర్ 9000773399, మద్దుల గిరీష్ కుమార్ (9848030305) లను సంప్రదించవచ్చు.ఈ ఫోన్ నెంబర్లకు మెసేజ్ పెడితే బందరు పూర్వ విద్యార్థుల గ్రూప్ లో యాడ్ చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు.
--శ్రీకాంత్ చిత్తర్వు (ఎడిటర్-ఇన్-చీఫ్ మాగల్ఫ్ న్యూస్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు