ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
- March 19, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును విచారిస్తోన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు.
నాగ్ పాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు.దీంతో ఇక నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. నాగ్ పాల్‌తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్‌లోని మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపర్చించింది. కవిత రిమాండ్‌పై వాదనలు విన్న జడ్జి నాగ్ పాల్.. ఆమెను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. కవిత అరెస్ట్ కావడం.. ఆమెను వారంరోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన మూడు రోజుల్లోనే జడ్జి నాగ్ పాల్ బదిలీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక ఆదేశాలిచ్చిన జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా ట్రాన్స్‌ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్







