ఈ లక్షణాలుంటే.. మధుమేహం అలర్ట్‌గా భావించాలి.!

- March 19, 2024 , by Maagulf
ఈ లక్షణాలుంటే.. మధుమేహం అలర్ట్‌గా భావించాలి.!

మధుమేహం లేదా డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి దీని బారిన పడితే ఇక అంతే సంగతి. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా వుండడం వల్ల మధుమేహం వస్తుంది.
దీని కారణంగా శరీరంలో గుండె, కిడ్నీ, కళ్లు.. ఇలా అనేక అవయవాలు ఎఫెక్ట్ అవుతాయ్. దైనందిన జీవితంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. అందుకే ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించాలి. గుర్తించాకా అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స తీసుకుంటే, పూర్తి నివారణ సాధ్యం కాకపోయినా నియంత్రణలో వుంచొచ్చు.
చాలా సహజంగా కనిపించే కొన్ని లక్షణాలు డయాబెటిస్‌కి కారణం కావచ్చు. డయాబెటిస్ వున్నవారిలో చేతులు, కాళ్లకు ఊరికినే చెమటలు పట్టడం.. తిమ్మిరులు వంటి లక్షణాలు కనిపిస్తాయ్.
అలాగే, కొందరిలో చేతులు, కాళ్లలో వేళ్ల మధ్య చర్మం పొడిబారడం.. దురద వంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు.
పాదాలు ఎరుపు రంగులో మారి, నొప్పితో కూడిన వాపులు కనిపించడం కూడా డయాబెటిస్‌కి కారణం కావచ్చు.
అంతేకాదు, కాళ్లలో  పగుళ్లు.. పుండ్లు ఏర్పడడం కూడా డయాబెటిస్‌కి ప్రాధమిక లక్షణాలుగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే.. తదనుగుణంగా జీవన శైలి.. ఆహార శైలిని మార్చుకోవాలనీ నిపణులు సలహా ఇస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com