భారత్: మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- March 20, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ప్రక్రియను పూర్తిచేసేందుకు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. బుధవారం తొలి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి దశలో 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సహా 21 రాష్ట్రాల్లో పోటీచేసే అభ్యర్థులు బుధవారం నుంచి నామినేషన్ వేయనున్నారు.
మొదటి దశలో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. బుధవారం నుంచి మార్చి 27వ తేదీ (బీహార్ రాష్ట్రంలో 28వ తేదీ) వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. మార్చి 28న (బీహార్ రాష్ట్రంలో మార్చి 30) నామినేషనల్ పరిశీలన ఉంటుంది. అదేవిధంగా మార్చి 30న (బీహార్ రాష్ట్రంలో ఏప్రిల్ 2) నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
2024 లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశలో జరిగే ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రెండు, అస్సాంలో నాలుగు, మణిపూర్ లో రెండు, మేఘాలయలో రెండు, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అడమాన్, నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానంకు, అదేవిధంగా తమిళనాడులో 39, రాజస్థాన్ రాష్ట్రంలో 12, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆరు, మహారాష్ట్రలో ఐదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఐదు, బీహార్ లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో మూడు సీట్లకు ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
తొలిదశలో ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. రెండో దశలో ఏప్రిల్ 26న 89 స్థానాలు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా మూడో దశలో మే7న 94 స్థానాలకు, నాలుగో దశలో మే 13న 96 స్థానాలకు, ఐదో దశలో మే 20న 49 స్థానాలకు, 6వ దశలో మే 25న 57 స్థానాలకు, ఏడో దశలో జూన్ 1న 57 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు