ఫుర్జన్ విల్లాలో చోరీ..దొరికిన దొంగ.. విలువైన వస్తువుల రికవరీ

- March 20, 2024 , by Maagulf
ఫుర్జన్ విల్లాలో చోరీ..దొరికిన దొంగ.. విలువైన వస్తువుల రికవరీ

దుబాయ్: మార్చి 9న అల్ ఫుర్జన్ కమ్యూనిటీలోని విల్లాలోకి చొరబడిన ఇద్దరు దొంగలను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు. ఐరీన్ సుట్టన్, ఆమె భర్త ఆండ్రీ వెర్డియర్ సెలవుల కోసం వెకేషన్ వెళ్లగా చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో వారి నివాసం నుండి Dh180,000 విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులకు ఐరీన్ కృతజ్ఞతలు తెలిపారు. "దుబాయ్ పోలీసులు దొంగలను అరెస్టు చేసారు. మార్చి 13న మమ్మల్ని పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మా వస్తువులలో కొన్నింటిని గుర్తించాము. నా పెళ్లి ఉంగరం, ఒమేగా వాచ్ మరియు ఇతర ఆభరణాలు కనిపించడంతో నేను సంతోషించాను. మా వస్తువులను ఎప్పుడు తిరిగొస్తాయా అని కోసం ఎదురు చూస్తున్నాము.’’ అని ఐరీన్ వెల్లడించారు.           

మీ ఇంటి భత్రతకు సూచనలు

రాబోయే ఈద్ అల్ ఫితర్ విరామం లేదా వేసవి సెలవుల కోసం ప్లాన్ చేస్తే.. మీ ఇంటికి రక్షణ ఉండేలా చూసుకోండి.  మీరు నమ్మదగిన పొరుగువారు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఉంటే, మీ ఆస్తిని కనిపెట్టమని చెప్పాలి. విల్లా కమ్యూనిటీలోని నివాసితులు ఇంటిని పర్యవేక్షించగల సెక్యూరిటీకి తెలియజేయవచ్చు. దుబాయ్ నివాసితులు దుబాయ్ పోలీసుల 'హోమ్ సెక్యూరిటీ సర్వీస్'ని పొందవచ్చు. ఇది విల్లా నివాసితులు దూరంగా ఉన్నప్పుడు వారి ఇళ్లను పర్యవేక్షించడానికి పొరుగు ప్రాంతాలలో మోహరించిన పెట్రోలింగ్‌ను ఉపయోగించుకునేలా చేస్తుంది.  అదే విధంగా ఎల్లప్పుడూ కొన్ని లైట్లను ఆన్ చేసి పెట్టాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com