సినీ నటుడు సాయి రోహిత్ అడ్డంగా బుక్కయ్యాడు..

- June 04, 2016 , by Maagulf
సినీ నటుడు సాయి రోహిత్  అడ్డంగా బుక్కయ్యాడు..

నగరంలోని జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రధాన కూడలిల్లో శనివారం అర్థరాత్రి పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మరో సినీ నటుడు అడ్డంగా బుక్కయ్యాడు. కాయ్ రాజా కాయ్ ఫేం సాయి రోహిత్ మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులుకు దొరికిపోయాడు.జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు అతన్ని బ్రీత్ ఎనలైజర్ లో చెక్ చేయగా తాగి వాహనాన్ని నడిపినట్లు తేలింది. బ్రీత్ ఎనలైజర్‌లో 42 శాతం నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com