ఆఫ్గనిస్తాన్: తెరుచుకున్న పాఠశాలలు.. బాలికలపై నిషేధం

- March 20, 2024 , by Maagulf
ఆఫ్గనిస్తాన్: తెరుచుకున్న పాఠశాలలు.. బాలికలపై నిషేధం

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు బుధవారం నుండి తెరుచుకున్నాయి. ఆఫ్ఘన్‌ కేలండర్‌ ప్రకారం నూతన సంవత్సరాదికి ఒకరోజు ముందు అకడమిక్‌ ఇయర్‌ పున: ప్రారంభమైందని పేర్కొంది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రావిన్స్‌లలో పాఠశాల బెల్‌ మోగడంతో ఆఫ్ఘన్‌లో వేడుక ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రభుత్వ యూనివర్శిటీలలో కూడా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైందని తెలిపింది.

అయితే ఉన్నత స్థాయి తరగతుల్లో చేరకుండా బాలికలపై నిషేధం ఈ ఏడాది కూడా కొనసాగనుందని విద్యాశాఖ ప్రకటించింది.  ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం 2022 మార్చిలో తాలిబన్‌ ప్రభుత్వం బాలికల ఉన్నత విద్యపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మీడియా సంస్థలకు ఇచ్చిన ఆహ్వానంలో మహిళా జర్నలిస్టులు ఈ వేడుకలను కవర్‌ చేయకుండా తాలిబన్‌ ప్రభుత్వం అడ్డుకోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com