ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..
- March 21, 2024
న్యూ ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ఇంటికి 12 మంది ఈడీ అధికారుల బృందం వెళ్లింది. దీంతో ఆయన ఇంటి ముందు హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ కేసు, జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.
దీంతో సమన్లతో కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది ఈడీ అధికారుల బృందం. కేజ్రీవాల్ ను విచారించడానికి తాము వచ్చినట్లు ఈడీ చెప్పింది. కేజ్రీవాల్ నివాసంలోనే నార్త్ ఢిల్లీ డీసీపీ ఉన్నారు. సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కి 9 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. అలాగే, జల్ బోర్డు మనీలాండరింగ్ కేసులో మార్చి 16న కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ కూడా వెళ్లారు.
కాగా, ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కి ఇవాళ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు.
ఆయన విచారణకు సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు. కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన రెండు-మూడు గంటలకే కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారలున్నాయని ఈడీ అధికారులు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన బృందంలోనూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఉన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు