పులి - కొంగ కథ
- June 30, 2015
అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు పులి. ఒకరోజు అది వేటాడి తెచ్చుకున్న మాంసాన్ని భుజిస్తుండగా దాని నోటిలో ఒక దుమ్ము గుచ్చుకుని చాలా బాధపెట్టసాగింది. దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతోంది. ఎవరైనా అటు వైపుగా వస్తారేమోనని ఆశగా ఎదురు చూడసాగింది. వచ్చినా అది పులి కదా. భయంతో అందరూ దాన్ని చూసినా దూరంగా పారిపోతున్నారు. దాంతో దాని బాధ తీర్చేవారు ఎవరా? అని అది ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది. ఇంతలో ఒక కొంగ అటువైపుగా వచ్చింది. అప్పుడు పులికి దాన్ని చూసి ప్రాణం లేచి వచ్చినట్లైంది. వెంటనే కొంగ బావా! నీకు పుణ్యం వుంటుంది ఒకసారి నా వైపుకి వచ్చి నా నోటిలో గుచ్చుకున్న ఈ దుమ్ముని నీ పొడవాటి ముక్కుతో తీసేని నాకు ప్రాణ భిక్ష పెట్టవా. నీకు నా జీవితాంతం ఋణపడి ఉంటాను అని అడగ్గా దానికి కొంగ దాని బాధని చూసి జాలిపడి, ఎంతైనా ఈ అడవికి రాజు కదా అని మాట తియ్యలేక దాని వద్దకు వెళ్లి భయపడుతూనే దానిగొంతులోనికి తన ముక్కుని దూర్చి ఆ దుమ్ముని లాగేసింది. అప్పటి నుండి ఆ రెండూ మంచి స్నేహితుల్లా కొనసాగుతున్నాయి. ఇలా చాలా రోజులు గడిచాయి. అయితే ఒక రోజు పులికి ఎంత వెతికినా ఒక్క వేట కూడా దొరకలేదు. దాని కడుపులో ఆకలి దంచేస్తుంది. ఇక వేటాడే ఓపిక కూడాలేక బాగా నీరసించిపోయింది. దాంతో అది తన ప్రాణం నిలబెట్టుకోవడానికి ఎలాగైనా ఏదో ఒకటి తినాలని నిశ్చయించుకొంది. అదే తడవుగా దానికి కొంగ గుర్తుకొచ్చింది. దాంతో అది వాటి మధ్యన ఉన్న స్నేహాన్ని, ఇంతకు ముందు కొంగ చేసిన సాయాన్ని కూడా మరిచిపోయి, స్వార్ధంతో విచక్షణ లేకుండా ఒక పిచ్చి ఆలోచన చేసింది. వెంటనే కొంగకు కబురు పెట్టి, ఇంతకు ముందులానే తన గొంతులో దుమ్ము ఇరుక్కుపోయిందని అబద్ధం చెప్పి,ంది. దాంతో పాపం కొంగ పులి పన్నిన కపట ఆలోచనను కనపెట్టలేక దానికి సాయం చెయ్యాలని తన ముక్కును పులి గొంతులోకి దూర్చింది. ఆకలితో ఉన్న పులి దాని గొంతును గట్టిగా కొరికి పాపం ఆ కొంగను చంపి తినేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







