స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్
- June 30, 2015
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ త్రీవవాదులు అనుమానం పెంచుకున్నారు. ఆదివారం ఒక మహిళను, ఆమె భర్తను, సోమవారం ఇంకొక మహిళ ఆమె భర్తను పట్టుకుని తలలు నరికి వేశారు. అందరూ చూస్తున్న సమయంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు బహిరంగ ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డారని సిరియా మానవహక్కుల పరిశీలన సంఘం వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజోర్ రాష్ట్రంలో మహిళలు, వారి భర్తల తలలు నరికి వేశారని మానవ హక్కుల సంఘం చీఫ్ రమీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తు గతంలో బహిరంగ ప్రాంతాలలో మహిళలను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే మహిళల తలలు నరకడం ఇదే మొదటి సారి అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు అంటున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరాక్, సిరియాలో 3,000 మందికి పైగా స్థానికులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చంపేశారు. అందులో మహిళలు 1,800 మంది, 74 మంది పిల్లలు ఉన్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రోజుకు ఒక విధంగా సామాన్యులను అంతం చేసి వారి పైచాచికాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







