అన్ని కంపెనీలు GDRFA ఆన్లైన్ సిస్టమ్ లో నమోదు చేయించుకోవాలి
- June 30, 2015
దుబాయిలో నడపబడుతున్న అన్ని కంపెనీలు, ఉద్యోగుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆన్ లైన్ ఇ-సర్వీసు పద్ధతిని -రెసిడెన్సీ జారీకి, రెన్యువల్ కొరకు, వర్క్ పర్మిట్ మరియు విజిట్-వీసా దరఖాస్తుల మాన్యువల్ దరఖాస్తుకు బదులుగా మాత్రమే వాడాలని అక్కడి జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫేర్స్ (GDRFA) యొక్క డైరక్టర్ జనరల్ - మేజర్ జనరల్ మొహమ్మద్ ఆహ్మైద్ అల్ మర్రి తెలిపారు. GDRFA సేవలను వినియోగించుకోవడానికి ముందుగా అన్ని కంపెనీలు ఆన్లైన్ సిస్టమ్ కొరకు నమోదు చేయించుకోవాలని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ సేవలలోకి మారటం అనేది వినియోగదారుల కొరకు సేవలను అభివృద్ధి పరచి, సౌకర్యవంతంగా చేయడానికి మరియు పద్ధతులను సరళంగా చేయడానికేనని ఆయన స్పష్టంచేశారు. వినియోగదారుల సమయాన్ని, శ్రమను తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







