అత్యంత ఎయిర్ పొల్యుషన్ దేశాల జాబితా..7వ స్థానంలో యూఏఈ

- March 22, 2024 , by Maagulf
అత్యంత ఎయిర్ పొల్యుషన్ దేశాల జాబితా..7వ స్థానంలో యూఏఈ

యూఏఈ: ఎడారి వాతావరణ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి యూఏఈ దీర్ఘకాలిక వ్యూహాన్నిఅభివృద్ధి చేసింది. వాతావరణ మార్పు మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) ప్రతినిధి మాట్లాడూతూ.. ఎడారి దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకం సిఫార్సు చేసిన స్థాయిల కంటే మూడు రెట్లు ఎక్కువ కాలుష్య కారక పదార్థాల స్థాయిలను ఎదుర్కొంటున్నాయి అని అన్నారు.  2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం.. వార్షిక సగటు PM2.5 ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషితమైన దేశాలు,  ప్రాంతాల జాబితాలో యూఏఈ 7వ స్థానంలో నిలిచింది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQAir తయారు చేసిన ఈ నివేదిక 7,812 నగరాల నుండి PM2.5 ఎయిర్ క్వాలిటీ డేటాను సేకరించి ర్యాంకులను ప్రకటించింది. 134 దేశాలు, ప్రాంతాలలో మొత్తం 124 WHO వార్షిక PM2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్) మార్గదర్శక విలువ 5µg/m3ని మించిపోయింది. అంటే క్యూబిక్ మీటర్‌కు వార్షిక సగటు 5 మైక్రోగ్రాములు — µg/m3 — లేదా అంతకంటే తక్కువగా లెక్క కట్టింది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన 13 దేశాలలో యూఏఈతో సహా GCCలోని నాలుగు దేశాలు ఉన్నాయి. కువైట్ 11వ స్థానంలో, బహ్రెయిన్ 12వ స్థానంలో, ఖతార్ 13వ స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు భారతదేశం జాబితాలో అత్యంత కలుషితమైన దేశాలుగా నిలిచాయి. ఆయా దేశాల్లో  PM2.5 సాంద్రత వరుసగా 79.9, 73.7 మరియు 54.4µg/m3 గా ఉంది. యూఏఈలో PM2.5 గాఢత 43µg/m3. ఇది WHO మార్గదర్శకాలను ఏడు నుండి 10 రెట్లు అధికం. “PM2.5 కణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగి ఉంటాయి. PM2.5 కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అవి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో మాత్రమే కనబడతాయి. దాని చిన్న పరిమాణం కారణంగా PM2.5 చాలా కాలం పాటు గాలిలో నిలిచి ఉంటుంది. గాలిని పీల్చడం ద్వారా రక్తప్రవాహంలో చేరుతుంది. ” అని నివేదికలో పేర్కొన్నారు. WHO నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం మానవ ఆరోగ్యానికి అతిపెద్ద పర్యావరణ ముప్పు, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మంది మరణాలు సంభవిస్తున్నాయని అంచనా.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏడు మిలియన్ల అకాల మరణాలకు వాయు కాలుష్యం కారణమని పేర్కొంది. “PM2.5 వాయు కాలుష్యం కారణంగా ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్ మరియు ఊపిరితిత్తుల వ్యాధితో సహా అనేక ఆరోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహంతో సహా ఇప్పటికే ఉన్న అనారోగ్యాలను క్లిష్టతరం చేస్తుంది. ”అని నివేదికలో హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com