ఇస్రో మరో ఘనత…‘పుష్పక్’ ప్రయోగం సక్సెస్‌

- March 22, 2024 , by Maagulf
ఇస్రో మరో ఘనత…‘పుష్పక్’ ప్రయోగం సక్సెస్‌

చిత్రదుర్గ: దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ (విమానం తరహా రెక్కలు ఉన్న..) రాకెట్ పుష్పక్‌ను ఇస్రో నేడు విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోగల ఏయిరోనాటికల్ టెస్టింగ్ రేంజ్‌లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వే‌పై ల్యాండైంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు. అంతరిక్ష రంగంలో సుస్థిరత‌, వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్. అంటే..పీఎస్‌ఎల్‌వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇందులో అత్యాధునిక ఎక్స్-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్‌బెడ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్, ఆధునికీకరించిన డీసీ-ఎక్స్ఏ ఫ్లైట్ డెమాన్‌స్ట్రేటర్ ఉన్నాయి.

పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయింది. దీంతో, ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com