సినిమా రివ్యూ: ‘ఓమ్ భీమ్ భుష్’.!
- March 22, 2024శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా ‘ఓమ్ భీమ్ భుష్’. ఈ సినిమా ప్రచార చిత్రాలతోనే ఆకట్టుకుంది. స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాంతో, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాల్నీ, ఆసక్తిని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
క్రిష్ (శ్రీ విష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ) చిన్నతనం నుంచీ మంచి స్నేహితులు. వీరికి సైంటిస్టులవ్వాలన్నది చిన్ననాటి నుంచీ కోరిక. పీ హెచ్ డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. కానీ, అల్లరి చిల్లరిగా తిరిగే ఈ ముగ్గురి తాకిడి తట్టుకోలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తారు. బయటికొచ్చాకా కూడా ఏదో సాధించాలన్న తపన వుంటుంది కానీ, సీరియస్‌నెస్ లేకుండా తిరుగుతుంటారు. అయినా ఎలాగోలా డబ్బులు సంపాదించాలనుకుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య భైవరపురం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఊరిలోని కొన్ని సంఘటనలు ఈ ముగ్గురినీ ప్రభావితం చేస్తాయ్. ఆ ఊరి పెద్ద వేసిన శిక్షలో భాగంగా.. ఊరి చివర వున్న కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోటలో ఏముంది.? నాలుగు దశాబ్ధాలుగా అక్కడే వున్న సంపంగి దెయ్యం కథఏంటీ.? అసలు ‘సంపంగి’ దెయ్యానికీ క్రిష్‌కీ వున్న సంబంధం ఏంటీ.? చివరికి ఆ కోటలోని నిధిని ఈ ముగ్గురూ చేజిక్కించుకున్నారా.? తెలియాలంటే ‘ఓం భీమ్ భుష్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీనటుల పని తీరు:
శ్రీ విష్ణు గురించి చెప్పేదేముంది. సహజ నటుడు. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌తో పాటూ, డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చుకున్నాడు. డిఫరెంట్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎప్పటిలాగే తమ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ జస్ట్ ఓకే. ఆమెకి పెద్దగా నిడివి వున్న పాత్ర దక్కలేదు. ప్రియదర్శికి జోడీగా నటించిన ఆయేషా ఖాన్ తనకున్న పరిధిలో ఫర్వాలేదనిపిస్తుంది. ప్రియ వడ్లమాని స్పెషల్ సాంగ్‌లో ఆకట్టుకుంది. ఆదిత్య మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
హారర్ కామెడీ స్టోరీలు చాలానే చూశాం తెరపై ఇంతవరకూ. కానీ, దర్శకుడు హర్ష కొనగంటి.. తాను ఎంచుకున్న మెయిన్ పాయింట్‌ని పక్క దారి పట్టించకుండా కామెడీ ఎక్కడా మిస్ కాకుండా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమాని తెరకెక్కించడంలో విజయవంతమయ్యాడు. సన్నీ ఎమ్.ఆర్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హారర్ సీన్ల నేపథ్యంలో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్లుగా వుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా వుంది. సంపంగి కోట విజువల్స్ బాగున్నాయ్. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి వుండాల్సింది. అక్కడక్కడా కొన్ని సీన్లు సాగతతలా అనిపిస్తాయ్. నిర్మాణ విలువలు ఇచ్చిన బడ్జెట్‌లో రిచ్‌గా వున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీనే ఈ సినిమాకి మెయిన్ హైలైట్, రొటీన్ కథే అయినా కథనం నడిపిన తీరులో కొత్తదనం, అర్ధరాత్రి సర్పంచ్ ఇంట్లో దూరి ఈ ముగ్గురూ చేసే అల్లరి కడుపుబ్బా నవ్విస్తుంది. సెకండాఫ్‌లోని హారర్ కామెడీ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
రొటీన్‌గా అనిపించిన నిధి సన్నివేశాలు, సంపంగి దెయ్యం ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యాకా కథనంలో కాస్త స్పీడు తగ్గింది. అలాగే, హీరో, హీరోయిన్ మధ్య పేలవంగా సాగిన లవ్ ట్రాక్..
చివరిగా:
ముందే చెప్పారుగా.! నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్.! ‘ఓం భీమ్ భుష్’ ఆ మ్యాజిక్‌ని అందుకోవడంలో వందకు వంద శాతం సక్సెస్ అయ్యింది. ఓ రెండున్నర గంటల పాటు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునే హారర్ డ్రామాని ధ్రిల్‌గా ఫీలవ్వాలనుకునేవారు ‘ఓం భీమ్ భుష్’ సినిమాని ధియేటర్లలో భేషుగ్గా ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం