జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం..

- March 23, 2024 , by Maagulf
జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం..

న్యూ ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు సందేశం పంపించారు. దీన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. శనివారం ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరు సమాజం కోసం పని చేస్తూనే ఉండాలని, ఎవరినీ ద్వేషించవద్దని తన సందేశంలో కేజ్రీవాల్ కోరారు. తనను జైలుకు పంపించారనే కారణంతో బీజేపీలోని సోదరీసోదరమణులపై ద్వేషం పెంచుకోద్దని సూచించారు. తాను త్వరలోనే జైలు నుంచి బయట పడి ప్రజలను ఇచ్చిన హామీలను నెరవేరుస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

“మన దేశాన్ని బలహీనపరిచే అనేక శక్తులు భారతదేశం లోపల, వెలుపల ఉన్నాయి. మనమంతా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ శక్తులను గుర్తించి వాటిని ఓడించాలి. కేజ్రీవాల్ కటకటాల వెనుక ఉన్నారని ఢిల్లీలోని మహిళలు అనుకుంటున్నారు. మహిళలకు నెల నెలా రూ. 1000 ఇస్తానని నేను హామీయిచ్చాను. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాననే నమ్మకం నాకుంది. మీ సోదరుడు, కుమారుడినైన నన్ను నమ్మండి. ఎక్కువ రోజులు నన్ను జైలులో ఉంచలేరు. నేను త్వరలో బయటకు వచ్చి నా మాటను నిలబెట్టుకుంటాన”ని తన సందేశంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కేజ్రీవాల్, ఆయన బృందం అవినీతి బండారం బయట పెడతా నని మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. కేజ్రీవాల్ చేసిన 10 స్కామ్‌లు బయటపడబోతున్నాయని, వీటి సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించాడు. ఢిల్లీ ఎక్సైజ్ కేసు ప్రారంభం మాత్రమేనని, కేజ్రీవాల్ ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటకు వెళ్లలేరని తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు. అవినీతి కేసులో కేజ్రీవాల్, కవితను త్వరలో సీబీఐ, ఈడీ ప్రశ్నిచబోతుందని జోస్యం చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com