‘సరిపోదా శనివారం’.! నానితో ఈ సారి మామూలుగా వుండదు.!
- March 23, 2024సినిమా సినిమాకీ డిఫరెంట్ వేరియేషన్స్ వున్న కథలు ఎంచుకుంటూ వరుస హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ‘దసరా’తో బీభత్సమైన మాస్ హిట్ కొట్టి, ‘హాయ్ నాన్న’ అంటూ ఛిల్ అయ్యాడు.
ఈ రెండు సినిమాలూ నానికి మంచి సూపర్ హిట్స్ అందించాయ్. ఇదే జోరులో వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నాడు నాని.
అదే ‘సరిపోదా శనివారం’. టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు. మొన్నా మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్గా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఆన్ సెట్స్ తీసిన పిక్ అది. రక్తం కారుతున్న చేయిని ఈ పిక్‌లో చూపించారు. అంటే తాజా షెడ్యూల్లో ఏదో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారని అర్ధమవుతోంది.
అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్డేట్ శనివారమే రిలీజ్ చేయాలనుకుంటున్నారట చిత్ర యూనిట్. టైటిల్‌ని గుర్తు చేస్తూ వుండేందుకే ఇలా ప్లాన్ చేసినట్లున్నారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్