దుబాయ్ మెట్రోలో ఫ్రీ అంబ్రెల్ల సర్వీస్
- March 24, 2024
యూఏఈ: దుబాయ్‌లో వర్షం కురుస్తున్న రోజున మీ గొడుగు తీసుకురావడం మర్చిపోయారా? ఇప్పుడు, ఎమిరేట్‌లోని ప్రయాణికులు తమ నోల్ కార్డ్‌లను ఉపయోగించి ఉచితంగా గొడుగును తీసుకోవచ్చు. రోడ్లు మరియు రవాణా అథారిటీ శనివారం ఈ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం అల్ ఘుబైబా బస్ మరియు మెట్రో స్టేషన్‌లో అందుబాటులో ఉన్న 'స్మార్ట్ గొడుగు సేవ' మూడు నెలల టెస్ట్ రన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఫలితాలను బట్టి ఇతర స్టేషన్‌లకు సేవలను విస్తరించనున్నట్లు రవాణా వ్యవస్థల డైరెక్టర్ ఖలీద్ అల్ అవధి తెలిపారు. అల్ ఘుబైబా బస్ లేదా మెట్రో స్టేషన్ లోపల, ప్రయాణికులు గొడుగులు ఉంచే స్క్రీన్ మరియు బాక్స్ స్టాండ్ లో ఈ సర్వీస్ ను పొందవచ్చు. కెనడియన్ కంపెనీ ఉంబ్రాసిటీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు