రంగంలోకి దిగిన కేసీఆర్
- March 24, 2024
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొనాలని నిర్ణయించినట్టు తెలిసింది. మొత్తం 17 నియోజకవర్గాలను చుట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతోపాటు క్యాడర్‌లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్‌షో నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగులో పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







