అబుదాబి, దుబాయ్‌లో హాట్ కేకుల్లా ప్రాపర్టీ ప్రాజెక్ట్‌లు
- March 25, 2024
యూఏఈ: యూఏఈలోని ప్రాపర్టీ ప్రాజెక్ట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలలో బలమైన ర్యాలీ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈ సంవత్సరం సైతం వృద్ధి చెందుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే తక్కువ ధర కారణంగ డిమాండ్ పెరుగుతుందని, విదేశీ పెట్టుబడిదారులు మరియు నివాసితులు డిమాండ్‌ను పెంచుతున్నారని ప్రముఖ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ మరియు మేనేజ్‌మెంట్ కంపెనీ వాస్ల్ తెలిపారు. మొత్తం 600 యూనిట్ల పార్క్ వ్యూస్ రెసిడెన్సెస్ టవర్ Aని ప్రారంభించిన 36 గంటల్లోనే సేల్ అయిందని పేర్కొన్నారు. 42-అంతస్తుల పార్క్ వ్యూస్ రెసిడెన్సెస్ టవర్ A అనేది అల్ కిఫాఫ్‌లోని జబీల్ పార్క్‌కి ఎదురుగా ఉన్న వాస్ల్1 మాస్టర్ డెవలప్‌మెంట్‌లో ఒక భాగంగా ఉంది. అబుదాబికి చెందిన అల్దార్ ప్రాపర్టీస్ మాట్లాడుతూ.. హెవెన్ యొక్క మొదటి రెండు దశలను అల్దార్ తక్కువ సమయంలో విక్రయించామని, విదేశీ పెట్టుబడిదారులు మరియు ప్రవాస నివాసితులు కొనుగోలు చేసిన యూనిట్లలో మూడు వంతులు ఉన్నారని చెప్పారు. మొత్తంగా Dh3.1 బిలియన్ల అమ్మకాలు జరిగాయన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు