ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది...
- March 25, 2024ఐపీఎల్ 2024 సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు జట్లు హోరాహోరీగా తలపడతున్నాయి. ఈ క్రమంలో తాజా సీజన్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.
ఎన్నికల నేపథ్యంలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ వాటిన్నింటిని కొట్టిపారేస్తూ మెుత్తం మ్యాచ్ లను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ఉన్నప్పటికీ.. మెుత్తం 74 మ్యాచులను మనదేశంలోనే నిర్వహించనున్నారు. అంతేకాదు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను మోథేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్ మ్యాచులను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మే 26వ తేదీన టైటిల్ పోరు జరగనుంది. అంటే 12 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ తుది పోరుకు చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుంది.
రెండో దశ మ్యాచ్‌లు ఎప్పటి నుంచంటే..
ఏప్రిల్ 7వ తేదీన తొలి దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రోజు నుంచే రెండో దశ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్(CSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడనున్నాయి. మే 21వ తేదీన క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 24వ తేదీన క్వాలిఫయర్ 1, మే 26న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం….17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు