రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్‌

- May 20, 2024 , by Maagulf
రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్‌

జెడ్డా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని రాయల్ కోర్ట్ వెల్లడించింది. కింగ్ సల్మాన్ కు ఆదివారం జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్ రాయల్ క్లినిక్‌లలో వైద్య పరీక్షలను పూర్తి చేసినట్టు తెలిపింది. ఇందులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇన్ఫెక్షన్ నుండి కోలుకునే వరకు యాంటీబయాటిక్స్‌తో కూడిన చికిత్స కార్యక్రమాన్ని అల్-సలామ్ ప్యాలెస్‌లో వైద్య బృందం అందజేస్తుందని ఒక ప్రకటనలో రాయల్ కోర్ట్ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com