నిబంధనల ఉల్లంఘన.. హెల్త్‌కేర్ ఫెసిలిటీ తాత్కాలికంగా మూసివేత
- March 26, 2024
దోహా: లైసెన్సుల కోసం ఎదురుచూస్తున్న నలుగురు ప్రాక్టీషనర్లను నియమించుకున్నందుకు హెల్త్‌కేర్ ఫెసిలిటీపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోగ్య సదుపాయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హెల్త్‌కేర్ ఫెసిలిటీలు తప్పనిసరిగా ఆరోగ్య చట్టాలకు కట్టుబడి ఉండాలని, వారి అవసరమైన వృత్తిపరమైన లైసెన్స్‌లను పూర్తి చేయడానికి ముందు ఆరోగ్య సంరక్షణ అభ్యాసకులను నియమించుకోవద్దని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్లు స్పెషలైజేషన్ రంగాలకు సంబంధించిన నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఆరోగ్య అభ్యాసకులకు మంజూరు చేయబడిన వృత్తిపరమైన లైసెన్స్‌ల రకాలను https://dhp.moph.gov.qa/en/Pages/SearchPractitionersPage.aspxద్వారా ప్రజలు తనిఖీ చేసుకోవచ్చని సూచించింది. సాధారణ ప్రజలు కూడా [email protected]కి ఇ-మెయిల్ పంపడం ద్వారా ఆరోగ్య ప్రాక్టిషనర్లకు సంబంధించిన ఏవైనా చట్టవిరుద్ధమైన పద్ధతులను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు నివేదించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు