రియాద్‌లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- March 27, 2024రియాద్: రియాద్‌లో అనేక మంది అర్హత లేని ఆరోగ్య నిపుణుల ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత అరెస్టు చేసినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టు చేసిన వ్యక్తులపై అవసరమైన శిక్షార్హత చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. రియాద్‌లోని హెల్త్ క్లినిక్‌లో ఒకరోజు శస్త్రచికిత్స విభాగం కూడా మూసివేయించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా స్కిన్ స్పెషలిస్ట్‌గా చెప్పుకుంటూ చికిత్సలు చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తనిఖీలో గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ ప్రాక్టీసింగ్ చట్టంలోని ఆర్టికల్ టూ లైసెన్స్ పొందకుండా ఏ ఆరోగ్య వృత్తిని అయినా పాటించడాన్ని నిషేధించాలని చెబుతోందని పేర్కొంది. అదే చట్టంలోని ఆర్టికల్ 13 ఆ ప్రయోజనం కోసం నియమించబడిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో రోగులను పరీక్షించడాన్ని నిషేధిస్తుంది. రోగుల భద్రత, ప్రజారోగ్యం మరియు వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు కాలానుగుణ తనిఖీ పర్యటనలు నిర్వహించడం, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచురించబడిన వాటిని అనుసరించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు