దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- May 20, 2024
యూఏఈ: దుబాయ్‌ని సైకిల్-ఫ్రెండ్లీ సిటీగా మార్చాలనే తపనతో రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సైకిళ్లు, స్కూటర్లు మరియు పాదచారులకు అనుగుణంగా ట్రాక్‌ను నిర్మించడానికి సిద్ధమైంది. అల్ సుఫౌహ్‌ను దుబాయ్ హిల్స్‌ను హెస్సా స్ట్రీట్ ద్వారా లింక్ చేసే ఈ కొత్త ట్రాక్, షేక్ జాయెద్ రోడ్ మరియు అల్ ఖైల్ రోడ్‌లను దాటే రెండు వంతెనలను నిర్మించనున్నారు. మల్టీ-వినియోగ ట్రాక్ 13.5 కి.మీ పొడవు, 4.5 మీటర్ల వెడల్పు (సైక్లిస్ట్‌లు & స్కూటర్ రైడర్‌లకు 2.5 మీటర్ల వెడల్పు ట్రాక్, పాదచారులకు 2 మీటర్ల వెడల్పు గల ట్రాక్) నిర్మిస్తారు. ఇది అల్ బార్షా మరియు అల్ బార్షా హైట్స్ వంటి కీలకమైన రహదారుల గుండా 12 విభిన్న నివాస, వాణిజ్య మరియు విద్యా ప్రాంతాలకు సేవలు అందించనుంది. "సైక్లిస్టులు, స్కూటర్ రైడర్లు మరియు పాదచారుల కోసం నిర్దేశించిన ఈ ట్రాక్ హెస్సా స్ట్రీట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగం" అని ఆర్టీఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ టేయర్ అన్నారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







