'బాహుబలి' తలదన్నేలా మరో సినిమా..
- June 05, 2016
ప్రపంచ సినిమాకి భారతీయ సినిమా అంటే 'బాహుబలి' మాత్రమే అన్న పరిస్థితి ఇప్పుడు. అలాంటిది ఆ సినిమాని తలదన్నేలా మరో సినిమా చేయడానికి సన్నద్దమవుతున్నాడు ఓ తమిళ దర్శకుడు. అతడెవరో కాదు, దర్శకుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సుందర్ సి. సుమారు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ సినిమాని తమ వందో చిత్రంగా శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ నిర్మించనుండటం విశేషం. ఈ విషయాన్ని సుందర్ సి భార్య కుష్బూ ధృవీకరించారు కూడా. '' శ్రీ థెనాందల్ ఫిల్మ్స్ సంస్థలో సుందర్ సి ఓ భారీ సినిమా చేయనున్నారు. ఆయనెప్పుడూ ఓ మంచి సినిమాని ప్రేక్షకులకివ్వడానికే ప్రయత్నిస్తా''రని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చిన కుష్బూ నటీనటులెవరన్నది ఇంకా ఫైనల్ కాలేదంటూ పూర్తి వివరాలతో అధికారక ప్రకటన వస్తుందన్నారు.మరోవైపు థెనాందల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చారిత్రాత్మక చిత్రంలో దక్షిణాదిన అగ్రహీరోలుగా రాణిస్తున్న మహేశ్ బాబు, సూర్య హీరోలుగా నటించనున్నట్టు వినికిడి. ప్రస్తుతం ఈ వార్త ఇరు పరిశ్రమల్లోనూ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా '24' సినిమాతో అందర్నీ మెప్పించిన తిరు పనిచేయనున్నారట. 'బాహుబలి' చిత్రానికి పనిచేసిన సాబు సిరిల్, కమల్ కన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కానున్నారు. సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్, ఇళయరాజా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మహేశ్, సూర్య కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. వాటి అందుకోవడం అంత సులువైతే కాదు. అసలీ కాంబినేషన్ డిమాండ్ చేసేలా సుందర్ సి ఎలాంటి కథని సిద్ధం చేసుంటారు..?
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







