కాల్షియం డెషిషియన్సీని గుర్తించడమెలా.?

- March 29, 2024 , by Maagulf
కాల్షియం డెషిషియన్సీని గుర్తించడమెలా.?

శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం. ఎముకలు ధృడంగా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుండగలదు. ఏ పని చేయడానికైనా శరీరం సహకరించగలదు. అలాంటి అతి కీలకమైన ఎముకల్ని ధృడంగా వుంచడంలో కాల్షియం పాత్ర కీలకం.
ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం వుంటుంది. మిగిలిన ఐదు శాతం కాల్షియం కండరాల నిర్మాణంలో తోడ్పడుతుంది. పెద్ద వారిలో రోజుకు దాదాపు 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం పడుతుంది.
కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనపడడం, కీళ్ల నొప్పులు, పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుపడిపోయే ప్రమాదముంది. మరి, అలాంటి కాల్షియం డెషిషియన్సీని ముందుగానే గుర్తించడమెలా.?
కాల్షియం లోపం కారణంగా విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. తరచూ కీళ్లలో నొప్పులు బాధిస్తుంటాయ్. ఆడవారిలో పీరియడ్స్ సమస్సలు వస్తుంటాయ్. చేతి గోర్లు, కాళి గోర్లు నీర్ఝీవంగా మారి పొడిలా రాలిపోతుంటాయ్. గోళ్లపై తెల్లటి మచ్చలను సైతం గుర్తించవచ్చు.
ఈ లక్షణాలను గుర్తిస్తే.. వెంటనే వైద్యుని సలహా తీసుకుని కాల్షియం పిల్స్ తీసుకోవాల్సి వుంటుంది. అలాగే, నేచురల్‌గా క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకోలీ వంటి కూరగాయల్లో కాల్షియం అధికంగా లభిస్తుంది. పాలు, పాల సంబంధిత పదార్ధాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార పదార్ధాల్లోనూ కాల్షియం అధికంగా వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com