అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- March 29, 2024
దుబాయ్: దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
వరల్డ్ వైడ్ క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరకి వచ్చి కొలతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ విగ్రహాం పూర్తి కాగా.. నిన్న రాత్రి మార్చి 28న అల్లు అర్జున్ స్వయంగా తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేశారు. ఈ విగ్రహం అల వైకుంఠపురంలో సినిమాలోని రెడ్ జాకెట్ కాస్ట్యూమ్ తో పుష్ప మేనరిజం చూపిస్తూ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఓపెనింగ్ తర్వాత తన మైనపు విగ్రహంతో సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు తగ్గేదే లే అంటూ కామెంట్ చేశాడు. అలాగే మైనపు విగ్రహం ఓపెనింగ్ వీడియోనూ కూడా పంచుకున్నాడు. బన్నీతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫోటోస్ వైరలవుతుండగా.. బన్నీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు సినీ సెలబ్రెటీస్, అభిమానులు.
ఇప్పటికే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ ది మాత్రం దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే మార్చి 28న బన్నీ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ గంగోత్రి విడుదలైన రోజు. అదే రోజున తన మైనపు విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు బన్నీ. తన జీవితంలో ఇది మరుపురాని ప్రయాణమని.. ఈరోజు ఎప్పటికీ ప్రత్యేకమంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన వెన్నంటే ఉన్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







