లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- March 29, 2024
శ్రీనగర్: జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. ఈ వాహనం శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్తుండగా, బ్యాటరీ చెష్మా ప్రాంతంలో ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజామున 1.15 గంటలకు 300 అడుగుల లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎస్‌డీఆర్‌ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్ పరిసరాల్లో భారీ వర్షాలు కూరుస్తున్నప్పటికీ సహాయక బృందాలు 10 మంది ప్రయాణికుల మృత దేహాలను వెలికితీసాయి. కారు డ్రైవర్ను జమ్మూలోని అంబ ఘ్రోథాకు చెందిన బల్వాన్ సింగ్ (47)గా గుర్తించారు. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!