డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్

- March 29, 2024 , by Maagulf
డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్

యూఏఈ: షార్జాలో డ్రగ్స్ కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష పడిన భారతీయ డీజే భార్య క్లేటన్ రోడ్రిగ్స్ కుటుంబం తీర్పుపై అప్పీల్ చేసింది. యూఏఈ న్యాయవ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేసింది. ముంబైకి చెందిన క్లేటన్ రోడ్రిగ్స్  జూన్ 2023లో షార్జా ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలిపిన కేక్‌తో పట్టుబడిన తర్వాత జైలు పాలయ్యాడు. క్లేటన్ భార్య ఫాలిన్ కేసులో ఇరుక్కున్నాడని మరియు నిర్దోషి అని నిరూపించబడుతుందని పేర్కొంది. క్లేటన్‌ను బేకర్ మరియు అతని సహచరుడు మోసం చేశారని, ఇలాగే అనేక మందిని మోసగించారని ముంబై పోలీసు నివేదిక ఉందని ఫాలిన్ తెలిపింది. ముంబై పోలీసుల ప్రకారం.. బేకర్ టీమ్ బాధితులను తెలియకుండా యూఏఈలోకి డ్రగ్స్ తీసుకువెళ్లేలా తప్పుదారి పట్టిస్తారు. ఒకవేళ దొరికిపోతే న్యాయ సహాయం అందిస్తున్నట్లు నటిస్తారు. న్యాయపరమైన ఖర్చుల కోసం బాధిత కుటుంబాల నుండి డబ్బు డిమాండ్ చేస్తారని పోలీసులు తెలిపారు.  బేకర్ బాధితుల్లో ఒకరు భారతీయ నటి క్రిసాన్ పెరీరా కూడా ఒకరు. పెరీరా 2023 ఏప్రిల్ 1న ఆడిషన్ మరియు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించాలని ఇద్దరు వ్యక్తులు ఆమెను మోసగించారు. వారు ఆమెను ఆడిషన్‌కు డ్రగ్స్‌తో నిండిన ట్రోఫీని తీసుకెళ్లేలా చేశారు. ఎయిర్ పోర్టులో దిగగానే పెరీరాను అధికారులు అరెస్టు చేసారు. అనంతరం ముంబై పోలీసులు బేకర్ మరియు అతని సహచరుడు RBని పట్టుకున్నారు. విచారణ అనంతరం పెరీరా షార్జా జైలు నుండి విడుదలైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com