ప్రాంతీయ భద్రత కోసం జిసిసి విజన్ ఆవిష్కరణ
- March 30, 2024
రియాద్: రియాద్‌లోని గ్రూప్ జనరల్ సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ప్రాంతీయ భద్రత కోసం తన విజన్‌ను ఆవిష్కరించింది. జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ఆశాజనకమైన మరియు సంపన్నమైన భవిష్యత్తును నిర్మించాలనే లక్ష్యంతో నైతిక విలువలు, ఐక్యతకు నిబద్ధతను సూచిస్తుందన్నారు. ప్రాంతీయ భద్రత కోసం చర్చలు, సహకారం, సమన్వయం మరియు విభిన్న దృక్కోణాల పట్ల గౌరవం వంటి సూత్రాలపై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీసీసీ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, దౌత్యవేత్తలు మరియు నిపుణులు హాజరైన ఈ వేడుక అంతర్జాతీయ భద్రత మరియు శాంతిని సాధించే దిశగా కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. ప్రాంతీయ భద్రతను పరిరక్షించడం, స్థిరత్వం మరియు శ్రేయస్సును నిర్ధారించడం, అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహించడం మరియు ఆర్థిక మరియు పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారించే విజన్ వ్యూహాత్మక లక్ష్యాలను అల్బుదైవి వివరించారు.
తాజా వార్తలు
- మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation
- నవంబర్ 5న ఖతార్‌లో వర్షం కోసం ప్రార్థనలు..
- మహిళల ప్రీమియర్ లీగ్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
- అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ
- యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్ నౌకలకు మినహాయింపు
- ప్రపంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!







