జేజమ్మతో జతకట్టనున్న ఆది
- June 05, 2016
వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తమిళ బాట పట్టిన ఈ యంగ్ హీరో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్న స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది మంచి మార్కులు సాధించాడు.దీంతో ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు ఆది మీద పడింది. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాల కోసం ఆదిని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారు. అదే బాటలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న లేడి ఓరియంటెడ్ సినిమా భాగమతిలో అనుష్కకు జంటగా ఆదిని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
దర్శకుడు అశోక్ చెప్పిన కథ విన్న ఆది వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇప్పటికే మళయాల నటుడు జయరాంను విలన్ పాత్రకు ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం టబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల నటులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అప్పుడే సినిమాలో నటించే నటీనటుల విషయంలో మరింత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







