‘టిల్లు స్క్వేర్’ డైరెక్టర్‌తో సందీప్ కిషన్.!
- April 01, 2024
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన, ‘టిల్లు స్క్వేర్’ రీసెంట్గా రిలీజై ప్రేక్షకాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. యూత్ ప్రధానంగా తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలను బాగానే అందుకుంటూ రేస్‌లో దూసుకెళ్తోంది.
కాగా, ఈ సినిమా డైరెక్టర్ అయిన మల్లిక్ రామ్, సందీప్ కిషన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందట. ప్రస్తుతానికి వివరాలేమీ తెలీవు కానీ, ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ని సందీప్ కిషన్‌కి నెరేట్ చేశాడట మల్లిక్ రామ్.
‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాతో ఇటీవల సందీప్ కిషన్ ఓ మోస్తరు సోదిలో నిలిచాడనే చెప్పొచ్చు. ఈ టైమ్‌లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా అంటే కాస్త నిలదొక్కుకునే అవకాశాలున్నాయ్.
మరి, వీలైనంత త్వరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగి, షూటింగ్ పూర్తయ్యి.. ప్రేక్షకుల ముందుకు రావాలి. ఎంత కాదన్నా ఇదంతా జరగాలంటే, మరో ఆరు నెలలు పైనే పడుతుంది. ఏది ఏమైతేనేం, సందీప్ కిషన్ కొత్త ప్రాజెక్ట్ ఒకింత హాట్ టాపిక్ అయ్యింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు