వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని..!
- April 02, 2024ముంబై: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ వద్దకు పరుగు తీసుకుంటూ వెళ్లాడు. అయితే రోహిత్ భయాందోళనకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముంబై జట్టు ఫీల్డింగ్ సమయంలో రోహిత్ శర్మ స్లిప్ లో ఉన్నాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ కు రోహిత్ సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. అభిమాని దగ్గరికి వచ్చే వరకు రోహిత్ శర్మ అతన్ని గమనించలేదు. బౌండరీలైన్ వద్ద ఫీల్డర్ రోహిత్ వెనక్కు చూడు అంటూ సూచించడంతో రోహిత్ వెనక్కు మళ్లేసరికి అభిమాని అతనిదగ్గరకి చేరిపోయాడు.. దీంతో రోహిత్ శర్మ ఒక్కసారిగా భయాందోళనకు గురై రెండు అడుగులు వెనక్కు వేశాడు. అభిమాని అని గుర్తించి అతనికోరిక మేరకు ఓ హగ్ ఇచ్చాడు.. ఆ తరువాత పక్కనే ఉన్న ఇషాంత్ కిషన్ వద్దకు వెళ్లగా.. ఇషాంత్ సైతం రోహిత్ అభిమానికి హగ్ ఇచ్చాడు. దీంతో అతడు సంతోషంతో గెంతులేస్తూ గ్రౌండ్ లోనుంచి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని పక్కకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!