స్కూల్ ట్యూషన్ ఫీజులకు డైరెక్ట్ డెబిట్, పే-లేటర్ ఆప్షన్‌లు
- April 02, 2024
యూఏఈ: కొత్తగా ప్రారంభించబడిన పాఠశాల ఫీజు చెల్లింపు యాప్ యూఏఈ కుటుంబాలలో ప్రజాదరణ పొందుతోంది. ఇది వాయిదాలలో చెల్లించే అవకాశాన్ని ఇది అందిస్తుంది. ఎడ్యుకేషన్ డొమైన్ కోసం పేపర్‌లెస్ డైరెక్ట్ డెబిట్ సొల్యూషన్స్‌లో దేశంలోనే అగ్రగామిగా ఉన్న డైరెక్ట్ డెబిట్ సిస్టమ్, ఫిన్‌టెక్ స్టార్ట్-అప్ ‘Zenda’ తో చేతులు కలిపింది. వారు ఆటోమేటెడ్ మరియు డిజిటలైజ్డ్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ట్యూషన్, సంబంధిత విద్యా ఖర్చుల చెల్లింపు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులను లక్ష్యంగా చేసుకున్నారు. యూజర్-స్నేహపూర్వక చెల్లింపు యాప్‌ను పేపర్‌లెస్ డైరెక్ట్ డెబిట్ సిస్టమ్‌తో అనుసంధానిస్తుంది. తల్లిదండ్రులు పే-నౌ మరియు పే-లేటర్ ఆప్షన్‌లతో పాఠశాల బిల్లులను సెటిల్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ట్యూషన్ ఫీజుతో పాటు, కుటుంబాలు యాప్ ద్వారా తమ చెల్లింపు ఎంపికలను విస్తరించేందుకు రవాణా మరియు భోజనం వంటి ఇతర సేవలను కూడా ఈ యాఫ్ పొందవచ్చు. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్‌కు మద్దతు ఇస్తుందని యాప్ వ్యవస్థాపకుడు , సీఈ ఉమ్మైర్ బట్ తెలిపారు. యూఏఈలో పూర్తి డిజిటల్ రికరింగ్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ను అందించడంలో అగ్రగామిగా ఉన్న డైరెక్ట్ డెబిట్ సిస్టమ్‌తో చేతులు కలిపామని, తమ సేవలు విద్యా సంస్థలు సౌలభ్యాన్ని అందించడంలో సహాయపడతాయని, వారి రుణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని సహ వ్యవస్థాపకుడు రామన్ త్యాగరాజన్ వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







