ఆర్మీ మెడికల్ కార్ప్స్ రైజింగ్ డే

- April 03, 2024 , by Maagulf
ఆర్మీ మెడికల్ కార్ప్స్ రైజింగ్ డే

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక ఆసుపత్రులలో ప్రాణాలను రక్షించే బాధ్యతతో  పాటు, భారత సైన్యం పాల్గొన్న అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ మరియు యుద్ధాలలో గాయపడిన సైనికులకు వైద్య సహాయం అందించడంలో ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ పాత్ర క్రియాశీలకమైనది. నేడు ఆర్మీ మెడికల్ కార్ప్స్  వ్యవస్థాపక దినోత్సవం.

రక్షణ సేవల కోసం ప్రత్యేకించి ప్రత్యేక మెడికల్ కార్ప్స్‌గా పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మొదటిసారిగా 1939లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చింది.  ఏప్రిల్ 3, 1943న ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ ఏర్పడింది. "సర్వే సంతు నిరామయ"  అనేది AMC యొక్క నినాదం, దీని అర్థం అందరూ వ్యాధులు, వైకల్యం నుండి విముక్తి పొందండి.

ఆర్మీ మెడికల్ కార్ప్స్ అనేది ఇండియన్ ఆర్మీలో ఒక స్పెషలిస్ట్ కార్ప్స్ , ఇది ప్రాథమికంగా అన్ని ఆర్మీ సిబ్బందికి, సైనిక సేవలో ఉన్న మరియు విశ్రాంత సైనిక దిగ్గజాలకు, వారి కుటుంబాలతో పాటు వైద్య సేవలను అందిస్తుంది. ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోని శాఖలతో పాటు , ఇది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) లో భాగం . AFMS విభాగం సుమారు 60,000 మంది సిబ్బందిని కలిగి ఉంది.

ఆర్మీ మెడికల్ కార్ప్స్ (AMC) సెంటర్ మరియు కళాశాల లక్నోలో ఉంది , ఇక్కడ కొత్త రిక్రూట్‌మెంట్లు మరియు అధికారులు శిక్షణ పొందుతారు. ఇది AMC రికార్డులను కూడా కలిగి ఉంది. వైద్య అధికారులు శిక్షణ తర్వాత పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుండి లేదా అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా ఇతర వైద్య కళాశాలల నుండి నియమించబడతారు .

పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC), AFMS యొక్క ప్రధాన శిక్షణా సంస్థ. ఇది అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను రెండింటినీ అందిస్తుంది. AFMC  కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సింగ్‌లో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సును  నిర్వహిస్తుంది. అదనంగా, ఆర్మీ హాస్పిటల్ (పరిశోధన మరియు రెఫరల్) మరియు అన్ని కమాండ్ హాస్పిటల్స్ AMC అధికారులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అందజేస్తుంది.

ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పురుషులతో సమానంగా మహిళలు సేవలందిస్తున్నారు. AMCలో ప్రస్తుతం 1,212 మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆర్మీ డెంటల్ కార్ప్స్ మరియు మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో 168 మంది మరియు 3,841 మంది మహిళలు పనిచేస్తున్నారు.    

                                                  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
                                

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com