గంటల తరబడి చిక్కుకుపోయిన విల్లానోవా నివాసితులు
- April 03, 2024
దుబాయ్: ఎమిరేట్స్ రోడ్డులో మార్చి 30న జరిగిన అగ్నిప్రమాదం విల్లనోవాలో నివసిస్తున్న నివాసితులకు ఛేదు అనుభవాన్ని మిగిల్చింది. వాహనం ఢీకొనడం వల్ల ఏర్పడిన భారీ మంటలు.. హైవేకి వారి ఏకైక యాక్సెస్ పాయింట్ మూతపడింది. దీంతో విల్లానోవా నివాసితులు చాలా గంటలపాటు చిక్కుకుపోయారు. ప్రైమరీ యాక్సెస్ రోడ్డు గంటల తరబడి మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయిందని నివాసితులు వాపోయారు. “ప్రత్యామ్నాయ రహదారి లేదు. హమ్దాన్ బిన్ జాయెద్ రోడ్ వైపు కొత్త రహదారి నిర్మాణంలో ఉంది. అది కూడా బ్లాక్ చేయబడింది. ఇది మంచి పరిణామం కాదు. మాకు అసురక్షిత అనుభూతిని మిగిల్చింది. ” విల్లానోవా నివాసి ఘడా తెలిపారు. ఎమిరేట్స్ రోడ్ లేదా హమ్దాన్ బిన్ జాయెద్ రోడ్‌కి అదనపు యాక్సెస్ ఇప్పుడు అత్యవసరం అని నివాసితులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







