సౌదీ పౌరుడు, ఆసియా జాతీయుడికి 2ఏళ్ల జైలు శిక్ష

- April 03, 2024 , by Maagulf
సౌదీ పౌరుడు, ఆసియా జాతీయుడికి 2ఏళ్ల జైలు శిక్ష

రియాద్: రియాద్‌లోని క్రిమినల్ కోర్టు ఒక సౌదీ పౌరుడు, ఒక ఆసియా జాతీయుడిని వాణిజ్యపరంగా దాచిపెట్టినందుకు (కవర్ అప్) రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు ఒక్కొక్కరికి 500000 SR చొప్పున జరిమానా విధించింది. నిందితులు వాణిజ్యపరమైన కప్పిపుచ్చడం మరియు వాణిజ్య నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషిగా తేలిన పౌరుడు.. ప్రవాసుడి ఖాతాల నుండి స్వాధీనం చేసుకున్న అక్రమ నిధులను, నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని, కార్ల నకిలీ విడిభాగాలు,  నేరంలో ఉపయోగించిన సాధనాలను జప్తు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆసియా జాతీయుడిని బహిష్కరించాలని ఆదేశించింది. కచ్చితమైన సమాచారం మేరకు అనుమానితులపై దాడులు చేసినట్లు నేషనల్ యాంటీ-కమర్షియల్ కన్సీల్‌మెంట్ ప్రోగ్రామ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నకిలీ కార్ల విడిభాగాలను నిల్వ చేయడం, ప్రసిద్ధ బ్రాండ్‌ల ట్రేడ్‌మార్క్‌లతో తక్కువ-నాణ్యత గల విడిభాగాలను డబ్బాలలో ప్యాకింగ్ చేయడం, చుట్టడం వంటి వాణిజ్యపరమైన మోసాలకు సంబంధించిన ఆధారాలను అధికారులను సేకరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com