‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.! నవ్వించలేదు, భయపెట్టలేదు.!
- April 04, 2024
అంజలి ప్రధాన పాత్రలో గతంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న సినిమానే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ సినిమా టీజర్ విషయంలో చాలానే చేశారు. శ్మశానంలో టీజిర్ రిలీజ్ ఈవెంట్ అంటూ హంగామా చేశారు. కానీ, చివరి నిమిషంలో అంత రిస్క్ చేయలేక వెనుకడుగు వేశారు.
తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆశించిన రెస్పాన్స్ అందుకోలేకపోతోంది. మొదటి పార్ట్ చివరి భాగంలో డైరెక్టర్ ఛాన్స్ దక్కించుకున్న శ్రినివాస్ రెడ్డి.. తొలి ఛాన్స్‌ని ఎలా యూజ్ చేసుకున్నాడన్న కథాంశంతో ఈ పార్ట్ స్టోరీ నడుస్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు.
రీల్ దెయ్యాలతో తాను సినిమా తెరకెక్కించాలనుకుంటే, రియల్ దెయ్యాలే వచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు రియల్ దెయ్యాల దగ్గర రీల్ దెయ్యాలుగా నటిస్తున్న ఆర్టిస్టులు టిప్స్ తీసుకుంటున్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు.
కానీ, అదేమంత హిలేరియస్‌గా అనిపించడం లేదు. అంజలి పాత్ర కూడా ఏమంత ఎఫెక్టివ్‌గా లేదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయ్. హారర్ నేపథ్యం భయపెట్టడమూ లేదు, అలా అని నవ్వించేలానూ లేదన్న రెస్పాన్స్ వస్తోంది ట్రైలర్‌కి. మరి, ట్రైలర్‌కే ఇలాంటి రెస్పాన్స్ వస్తోంటే సినిమా సంగతెలా వుంటుందో. మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిజల్ట్ తేలిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!