ఎమిరేట్స్ డ్రాలో 39 సార్లు గెలిచిన టర్కిష్ వ్యక్తి.. Dh50,000 అందుకోనున్న భారతీయ ప్రవాసుడు
- April 05, 2024
యూఏఈ: ఇస్తాంబుల్‌లో నివసించే అలీ సైదీ ఎమిరేట్స్ డ్రాలో 30,000 దిర్హామ్‌లకు పైగా గెలిచిన తర్వాత తనను తాను "అదృష్టవంతుడు"గా భావించాడు. అతను తన బహుమతిలో కొంత భాగాన్ని మరిన్ని టిక్కెట్లు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పాడు. అతను 2022లో ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకున్నప్పటి నుండి, ప్రతి వారం టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాడు. రాబోయే డ్రాలో Dh15 మిలియన్ల ఈజీ6 గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకుంటాననే ఆశాభావంతో ఉన్నాడు. టర్కీలో లాజిస్టిక్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న అలీ మాట్లాడుతూ.. గెలుపు నన్ను మరింతగా ఆడటానికి ప్రోత్సహిస్తుందని చెప్పాడు.
60,000 దిర్హామ్‌లను గెలుచుకున్న భారతీయ డ్రైవర్
దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో ఒక డ్రైవర్ ఈజీ6తో 60,000 దిర్హామ్‌లను గెలుచుకున్నప్పుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. గెలిచిన దాంట్లోంచి కొన్ని రుణాలు చెల్లించాలని ప్లాన్ చేస్తున్నట్లు అతను చెప్పాడు. కువైట్‌లో ఫాస్ట్5 డ్రాలో మరో భారతీయ ప్రవాసుడు Dh50,000 అందుకున్నాడు. "నేను ఎప్పుడూ లైవ్ డ్రా చూస్తాను. కానీ ఈసారి నేను ఏదో పనిలో బిజీగా ఉన్నందున చూడలేకపోయాను. నాకు ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు AED 1000 గెలుచుకున్నానని అనుకున్నాను. కానీ నేను Dh50,000 చూసినప్పుడు షాక్ అయ్యాను." అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అక్బర్ అలీ అన్నారు. ప్రైజ్ మనీతో తన పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







