షాపింగ్ ప్రియులకు షాక్..సౌక్ అల్ మార్ఫా మూతపడుతుందా?
- April 05, 2024
దుబాయ్: దెయిరా ప్రసిద్ధ షాపింగ్ సెంటర్ సౌక్ అల్ మార్ఫా మూసివేత వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత రమదాన్ లో అనేక కార్యకలాపాలతో సందడిగా ఉండే రిటైల్ డెస్టినేషన్ సందర్శకులెవరూ కనిపించడం లేదు. చాలా దుకాణాలు మూత బడ్డాయి. దుబాయ్ ఐలాండ్స్ వాటర్ ఫ్రంట్ వెంబడి 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ మాల్ త్వరలో మూసివేయబడుతుందని లేదా వేరే చోటికి మార్చవచ్చని వినిపిస్తోంది. ప్రాపర్టీ ఏజెంట్లకు నఖీల్ పంపిన పునరాభివృద్ధి చెందిన దుబాయ్ దీవుల బ్రోచర్‌లో.. సౌక్ అల్ మార్ఫా కనిపించలేదు. దాని స్థానంలో వాటర్ ఫ్రంట్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ అలాగే డెస్టినేషన్ ఆర్ట్ అండ్ కల్చరల్ డిస్ట్రిక్ట్ అని ఉంది. అధికారికంగా దీనిపై ప్రకటన రాలేదు. దుబాయ్ దీవులలో ఉన్న వాటర్‌ఫ్రంట్ గమ్యం 2021లో ప్రారంభించబడింది. ఇది 400కి పైగా దుకాణాలకు నిలయంగా ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







