వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- April 05, 2024
రియాద్: ఏప్రిల్ 18 (9/10/1445 AH) కంటే ముందు విధించిన ట్రాఫిక్ జరిమానాల చెల్లింపులో 50% తగ్గింపును సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి నిర్ణయించినట్లు తెలిపింది. ఆరు నెలలలోపు మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించే వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ తగ్గింపును ప్రవేశపెట్టిన తర్వాత విధించే జరిమానాలకు ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 75 ప్రకారం 25% తగ్గింపు ఉంటుందని తెలిపింది. చట్టబద్ధంగా సూచించిన చెల్లింపు గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







