HMC లో ఈవెనింగ్ క్లినిక్‌లు సూపర్ సక్సెస్..!
- April 06, 2024
దోహా: కొత్త ఈవినింగ్ క్లినిక్‌ల ప్రారంభం హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో రోగులకు మెరుగైన సేవలు అందించనుంది.దీని ఫలితంగా సంరక్షణ పొందుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో రోగుల సగటు నిరీక్షణ సమయం తగ్గింది. ఆరు స్పెషాలిటీలలో సాయంత్రం క్లినిక్‌లను ప్రారంభించిన దాదాపు ఒక సంవత్సరంలో ఈ స్పెషాలిటీలకు రెఫరల్ నుండి రెండు వారాల్లో 12.7% ఎక్కువ మంది రోగులు పెరిగారు. మే 2023లో క్లినిక్‌లు ప్రారంభమైనప్పటి నుండి రెఫరల్‌ని అనుసరించి రోగులకు డాక్టర్‌ని చూడటానికి 15% తక్కువ వెయిటింగ్ సమయం కూడా నమోదు అయింది. ఈవెనింగ్ ఆప్తాల్మాలజీ, ఈఎన్ టీ, యూరాలజీ, ఆడియాలజీ క్లినిక్‌లు అంబులేటరీ కేర్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. బోన్ అండ్ జాయింట్ సెంటర్‌లో దాదాపు 22 ఆర్థోపెడిక్ ఈవినింగ్ క్లినిక్‌లు ఉన్నాయి. బారియాట్రిక్ కోసం సాయంత్రం క్లినిక్‌లు హమద్ జనరల్ హాస్పిటల్‌లో ఉన్నాయి. హెచ్‌ఎంసిలో పేషెంట్ ఎక్స్‌పీరియన్స్ చీఫ్ మరియు హమద్ హెల్త్‌కేర్ క్వాలిటీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ నాసర్ అల్ నైమి మాట్లాడుతూ.. హెచ్‌ఎంసిలో మేము పేషెంట్ అపాయింట్‌మెంట్ బుకింగ్ ప్రాసెస్‌ను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈవెనింగ్ క్లినిక్‌లలో రోగులకు వేగంగా అపాయింట్‌మెంట్ నిర్ధారణ లభిస్తుందని హెచ్‌ఎంసి యాక్టింగ్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ మరియం అల్ ముతావా తెలిపారు. అన్ని ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో సగటున 29% శాతం 'నో షో' రేటుతో, HMC రోగులు హాజరు కాలేకపోతే అపాయింట్‌మెంట్‌లను ముందస్తుగా రీషెడ్యూల్ చేయమని ప్రోత్సహిస్తుంది. HMC రోగులకు Nesmaak కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్, 16060ని ఉపయోగించాలని తెలిపింది. ఇది రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటుందని, దీని ద్వారా ముందస్తుగా అపాయింట్‌మెంట్ బుక్ చేయడం ద్వారా, అపాట్‌మెంట్‌లను మార్చడం లేదా రద్దు చేయడం ద్వారా రాబోయే అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..